Home బాపట్ల ఉచిత షుగరు వైద్య శిభిరానికి విశేష స్పందన

ఉచిత షుగరు వైద్య శిభిరానికి విశేష స్పందన

52
0

చీరాల : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో షుగరు ఉచిత వైద్య శిభిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిభిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1193 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. నెలకు సరిపడు మందులు ఉచితంగా అందజేసినట్లు ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. శిభిరానికి హాజరైన వారందరికి అల్పాహారం, తాగునీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేశారు. కేవలం మందులపై ఆధారపడవద్దని వైద్యులు చెప్పారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుందని సూచించారు. మానసిక ఆందోళన తగ్గించుకోవాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం అలవాటు చేసుకోవాలని చెప్పారు. క్యాంపులో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలా రాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ ప్రకాష్‌, డాక్టర్‌ పేట శ్రీకాంత్‌ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్‌, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్‌, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, గోపాల్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చేశారు.