టంగుటూరు : పంచాయితీ కార్యాలయం ఆవరణలో బెల్లం కోటయ్య వాకింగ్ ట్రాక్ వెల్ఫేర్ అసోసియేషన్, మక్కెన వెంకట కృష్ణారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. వైద్యశిభిరాన్ని కొండేపి ఎంఎల్ఎ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరులో నిర్మించిన బెల్లం కోటయ్య వాకింగ్ ట్రాక్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టంగుటూరులో అన్నా క్యాంటీన్, రామతీర్ధం జలాశయం నుండి నీటిని తీసుకొస్తామన్నారు.
బెల్లం జయంతిబాబు మాట్లాడుతూ ప్రతిఒక్కరు కార్పోరేట్ తరహా వైద్యం పొందాలన్నదే లక్ష్యంగా మక్కెన వెంకట కృష్ణారావు చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. ఎంఎల్ఎ స్వామి సహకారంతో గ్రామాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి చంద్రశేఖర్, ఎంపిడిఒ హనుమంతరావు, బెజవాడ వెంకటేశ్వర్లు, కామని విజయ్‌కుమార్, మోకాళ్ల వైద్యనిపుణులు కమలహాసన్, షుగరు వైద్యనిపుణులు సీతారామయ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నం వెంకటేశ్వర్లు, రావి బ్రహ్మం పాల్గొన్నారు.