అందరికి ఆరోగ్యమే వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ లక్ష్యం : రావి రామనాథంబాబు

    345
    0

    – ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరమన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ మాధవిలత
    – సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్న డాక్టర్ చింతల జై హరీష్
    పర్చూరు : జడ్పీ హైస్కూల్ ఆవరణలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వైద్య శిబిరాన్ని ప్రకాశం జిల్లా జెసి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పర్చూరులో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని పర్చూరు వైయస్సార్ సిపి ఇన్చార్జ్ రావి రామనాథం బాబు ప్రారంభించారు.

    ఈ సందర్భంగా రావి రామనాథం బాబు మాట్లాడుతూ వైస్సార్ ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరమని, కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే చెందుతుందన్నారు. ఆధునిక వైద్యం అనేది పేదలకు అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్చూరులో అనేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు.

    శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చింతల జై హరీష్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని ఎమర్జెన్సీ కేసులు, ఎముకలు విరిగిన వారికి, ఎముకుల సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా ఆపరేషన్లు, అన్ని జనరల్, లాప్రోస్కాప్రి ఆపరేషన్లు ఉచితంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్చూరు డివిజనల్ టీం లీడర్ సుజిత, ఆరోగ్యమిత్ర అశోక్, బోయజ్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.