చీరాల : ఊపిరితిత్తులు, నిమ్ము, ఎలర్జీ, షుగర్ వైద్య శిబిరం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ చేస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ వైద్యసేవలు అందించారు. డాక్టర్ అనిల్ మాట్లాడుతూ నెమ్ము, అలర్జీ సంబంధించిన ఆహార పదార్థాలను తినకూడదనీ, ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగ చేయాలని తెలిపారు. తన స్వగ్రామం ఇంకొల్లు దగ్గర గొల్లపాలేం అని, ప్రతి శుక్రవారం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో నెమ్ము , ఎలర్జీ, ఆయాసం, పిల్లి కూతలు, గురక సమస్యలకు, ఊపిరితిత్తుల క్యాన్సర్, షుగర్ వ్యాధికి బాధపడేవారికి 110మందికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశామని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు తెలిపారు.