Home ప్రకాశం వైస్సార్ ఆరోగ్యశ్రీని అందరూ వినియోగించుకోవాలి : గ్రామ వికాస్ ఫౌండేషన్ అధ్యక్షులు జకబ్, ఎండి తాడివాలస...

వైస్సార్ ఆరోగ్యశ్రీని అందరూ వినియోగించుకోవాలి : గ్రామ వికాస్ ఫౌండేషన్ అధ్యక్షులు జకబ్, ఎండి తాడివాలస దేవరాజు

369
0

చీరాల : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే అన్ని వ్యాధులకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు శ్రీ కామాక్షి కేర్ వైద్యశాల ఎండి తాడివలస దేవరాజ్ పేర్కొన్నారు. గ్రామ వికాస్ పీస్ ఫౌండేషన్, కామాక్షి కేర్ వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం గవినివారిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ గ్రామీణులకు ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించేందుకే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపట్ల శ్రద్ద వహించాలన్నారు. ఆహారం విషయంలో సమయ పాలనతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యంతోనే చిన్న వ్యాదులు కూడ ఇబ్బందికరంగా మారతాయన్నారు. అందరు ఆరోగ్యంగా ఉన్నపుడే కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవుతుందని చెప్పారు.

కామాక్షి కేర్ వైద్యశాలలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని అన్ని వ్యాధులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు వెంకటేశ్వర్లు, పలుకూరు సురేష్, గడ్డం శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా మందులు అందజేశారు. వైద్యులు రోగు‌లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు జాకబ్, యోహాను, దేవదానం, ధన, గ్రామ పెద్దలు పాల్గోన్నారు.