Home ప్రకాశం మక్కెన కృష్ణారావు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

మక్కెన కృష్ణారావు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

420
0

టంగుటూరు : మక్కెన వెంకట కృష్ణారావు 57 జయంతి సందర్భంగా క్యాండీ ఫోర్ట్ ఆవరణలో ఉచిత వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 1150 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. .ప్రముఖ పారిశ్రామిక వేత్త బెల్లం కోటయ్య ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, జిపిఐ, జనరల్ మేనేజర్ ఎం ప్రభాకరరావు, యువ పారిశ్రామిక వేత్త బెల్లం జయంత్ బాబు, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, తెలుగుదేశం సీనియర్ నాయకులు బెజవాడ వేంకటేశ్వర్లు, కామని విజయకుమార్, విజయవాడ ఆంధ్ర హాస్పటల్ కీళ్ల వైద్యులు బెల్లం సునీల్, దంత వైద్యులు బెల్లం రేవతి పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన రోగులకు ఉచిత భోజన వసతి, మందులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో యువకులు పాల్గొన్నారు.

చనిపోయిన తర్వాత కూడా ప్రజలకు తను చేసిన సేవల ద్వారా వెంకట కృష్ణారావు జీవించే ఉన్నారని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మక్కెన వెంకట కృష్ణారావు 57 జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు.