Home ప్రకాశం మెరుగైన సౌకర్యాలతో వాడరేవు రామానంద ఆశ్రమంలో ఉచిత షుగరు వైద్యశిభిరం

మెరుగైన సౌకర్యాలతో వాడరేవు రామానంద ఆశ్రమంలో ఉచిత షుగరు వైద్యశిభిరం

461
0

చీరాల : వాడరేవు రామానంద స్వామి ఆశ్రమం ఆవరణలో ప్రతినెలా నాలుగో ఆదివారం ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేయించుకున్న రోగులకు మళ్లీ శిబిరం వరకు సరిపడు మందులు ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో ప్రతినెలా రెండువేల మందికిపైగా రోగులు పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. షుగరు వ్యాధిగ్రస్తులు కావడంతో అందరికి వైద్య పరీక్షలు చేసేవరకు వేచి ఉండటం ఇబ్బందిగా మారడంతో రోగులను రెండు బ్యాచులు చేసి ఒక్కొక్క బ్యాచికి రెండునెలలకు సరిపడు మందులు ఇచ్చేవిధంగా గత కొన్ని నెలలుగా మార్చారు.

అయినప్పటికీ రోగుల సంఖ్య పెరగడంతో షుగరు పరీక్షలు చేసేందుకు స్టిఫ్ ద్వారా పరీక్షలు చేసి రోగులకు సౌకర్య వంతంగా నిర్వహించారు. 1217మందికి కరీక్షలు చేసి రెండు నెలలు సరిపడు మందులు పంపిణీ చేశారు. డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ కమలారాజేశ్వరి, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ పేట శ్రీకాంత్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ నారాయణం సురేష్, ఎ సురేష్, ఏంజి శంకరరావు, పి కామేశ్వరరావు, వాడరేవు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.