చీరాల : వేకువజామునుండే వరుసలో నిల్చుని షుగరు వ్యాధిగ్రస్తులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రతినెలా నాలుగో ఆదివారం వాడరేవు రామానందసరస్వతి ఆశ్రమం ఆవరణలో నిర్వహిస్తున్న ఉచిత షుగరు వైద్యశిభిరానికి ఆదివారం పెద్దసంఖ్యలో రోగులు ఆహజరయ్యారు. క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న వైద్యశిభిరానికి రోగులూ క్రమం తప్పకుండా హాజరై పరీక్షలు చేయించుకుని రెండు నెలలకు సరిపడు మందులు ఉచితంగా పొందుతున్నారు. డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ టి సుధాకర్‌యాదవ్, డాక్టర్ కమలారాజేశ్వరి, డాక్టర్ రవికాంత్, డాక్టర్ లలిత్‌ప్రకాష్, డాక్టర్ పి శ్రీకాంత వైద్యపరీక్షలు చేశారు. వైద్యశిభిరానికి హాజరైన రోగులకు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్, కె కృష్ణారావు, ఎ సురేష్, ఎంజి శంకరరావు, పి కామేశ్వరరావు పర్యవేక్షణలో అల్పాహారం, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు.