చీరాల : అందరికి ఆరోగ్యమే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆయుస్మాన్ భారత్ లక్ష్యమని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిభిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్ వైస్సార్ ఆరోగ్య శ్రీ, ఆయుషుమాన్ భారత్ మొదటి వారోత్సవం, పక్షోత్సవాల సందర్భంగా సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలందరికి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నూతన విధానం అమలైతే వెయ్యి రూపాయలకు పైబడిన అన్ని చికిత్సలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ అందరికి ఆరోగ్యం అనే నినాదంతో ఆయుషుమాన్ భారత్ ప్రకటించారని తెలిపారు. వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ పాలుకూరి సురేష్, ఎముకల స్పెషలిస్ట్ చలువాది వెంకటేశ్వర్లు, డాక్టర్ కిరణ్ ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు, డిజిటల్ ఎక్స్రే పరీక్షలు చేసి మందులు పంపినీ చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ తాడివలస సురేష్, ఆరోగ్య మిత్ర బాలమురళీకృష్ణ, హాస్పటల్ కోర్డినేటర్ సూర్య పాల్గొన్నారు.
Home ప్రకాశం చీరాల కామాక్షి హాస్పిటల్ లో విజయవంతమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వైద్య శిబిరం