Home ప్రకాశం కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

582
0

– భారతుల రామకృష్ణ మాస్టర్ సేవలు మరువలేనివి                         – చెరుకూరు కి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము: మన చెరుకూరు స్టూడెంట్స్ గ్రూప్ సభ్యులు                                 పర్చూరు : చెరుకూరు లో భారతుల రామకృష్ణ మాస్టర్ జ్ఞాపకార్థం మన చెరుకూరు స్టూడెంట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో చెరుకూరు నేరెళ్ల సుబ్బయ్య హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో చెరుకూరుకు చెందిన గడ్డం గోపి ఉచిత మందులు అందించారు. ఈసందర్భంగా చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలందరికి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీని వలన ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు.

అనంతరం శిబిరంలో చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ పలుకూరు సురేష్, జనరల్ ఫిజీషియన్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ రాధా అంజలి ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు అందించారు.

చెరుకూరు స్టూడెంట్స్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ భారతుల కుటుంబం వల్లనే మేము ఉన్నత స్థాయికి వచ్చామని, భారతుల రామకృష్ణ చదువుతోపాటు సమాజం గురించి, సమాజంలో ఎలా ఉండాలనేది నేర్పారని పేర్కొన్నారు. చెరుకూరు స్టూడెంట్ సభ్యులు మోదుగుల సుబ్బారావు, నాలి శివ సుబ్రహ్మణ్యం, భారతుల ఫణిరాజ్ శర్మ, కాలేషా, వైవి సుబ్బారావు, అడపా సురేష్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ బోయిన వెంకట లక్ష్మి నారాయణ, డా లక్ష్మణ్, డా భాస్కర్, విద్యార్థులు, గ్రామ ప్రజలు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.