Home బాపట్ల రోటరీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం

రోటరీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం

39
0

చీరాల : రోటరీ క్లబ్, పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో రోటరీ సామాజిక భవనం నందు “ఉచిత కంటి వైద్య శిబిరం” ఆదివారం నిర్వహించారు. వైద్య శిభిరంకు విశేష స్పందన లభించింది. 148 మందికి శంకర్ కంటి ఆసుపత్రి నుండి వచ్చిన అనుభవజ్ఞులైన డాక్టర్లు అబోలి, మేఘన పర్యవేక్షణలో కంటి పరీక్షలు చేశారు. కంటి శుక్లం సర్జరీకి 25 మందిని సిఫార్సు చేశారు. వీరిలో 15మందిని సర్జరీకి తీసుకువెళ్ళినట్లు రోటరీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో చందలూరి బాల వెంకటేశ్వరరావు, నక్కల సురేష్ బాబు, పోలుదాసు రామకృష్ణ, బి హేమంత్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, జివై ప్రసాద్, ప్రతాప్, రఘుకుమార్, మురళీకృష్ణ, పూర్ణా, శ్రీనివాసరావు, శ్రీనివాస బాబు, డివి సురేష్, హాస్పిటల్ ఇంచార్జీ నాగబాబు పాల్గొన్నారు.