Home బాపట్ల టిడిపి బాపట్ల పార్లమెంటు కార్యాలయానికి శంకుస్థాపన

టిడిపి బాపట్ల పార్లమెంటు కార్యాలయానికి శంకుస్థాపన

50
0

బాపట్ల (DN5 News) : టిడిపి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ, 3వ జోన్ ఇన్‌ఛార్జ్ వేపాటి చిరంజీవిరావు, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, వేగేశన నరేంద్ర వర్మ రాజు, మద్దులూరి మాల కొండయ్య, ఏలూరి సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్, టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, కార్యదర్శి రాఘవ పాల్గొని భూమి పూజ చేశారు.