Home ఆంధ్రప్రదేశ్ రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన

రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన

12
0

కనిగిరి : పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటుకు మంత్రి నారా లోకేష్‌, రిలయన్స్‌ అధినేత అనంత్‌ అంబాని బుధవారం శంకుస్థాపన చేశారు. ప్లాంటు నిర్మాణంతో వెనుకబడిన పిసిపల్లి ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ప్లాంటుకు అవసరమైన గడ్డి పెంచేందుకు ఎకరాకు ఏడాదికి రూ.30వేల కౌలు ప్రకటనతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో సహచర శాసన సభ్యులు మంత్రితో కలిసి చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సిఇఒ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు. దివాకరపల్లి వద్ద 497 ఎకరాల్లో రూ.139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సిబిసి ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు శంకుస్థాపన చేశారు.