చీరాల (DN5 News): పట్టణంలోని పేరాల మసీదు నుండి ఐఎల్టీడీ గేట్ వరకు రూ.13 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైన్‌పై కవర్ స్లాబ్ పనులకు టిడిపి నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం మహేంద్రనాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైన్‌పై కవర్ స్లాబ్ నిర్మాణం చేపట్టడం వల్ల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత మెరుగు పడుతుందని, రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యానాదిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, మామిడాల సుబ్బారావు, రాజశేఖర్, కౌన్సిలర్ సత్యానందం, కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు, సునీల్, జంగిలి రాముడు, వల్లపు వేణు పాల్గొన్నారు.






