చీరాల : పిట్టువారిపాలెంకు చెందిన బుర్ల వీరమ్మ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా మంజూరైన ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఇంటికి సంబంధించిన బిల్లులు కావడానికి పోజిషన్ సర్టిఫికెట్ అవసరం కావడంతో ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటినుండి ఎన్నిసార్లు తిరిగినా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండటంతో బుధవారం తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని, తనను ఇబ్బంది పెడుతున్న తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ధర్నాలో ఎంపిపి గవిని శ్రీనివాసరావు, బాధితురాలు బుర్ల వీరమ్మ, బుర్ల నల్లపోలయ్య, బంధువులు పాల్గొన్నారు.