Home ఆంధ్రప్రదేశ్ తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్‌కు ఓటర్లను మోసం చేయడం పెద్ద లెక్కేమీకాదు : నక్క...

తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్‌కు ఓటర్లను మోసం చేయడం పెద్ద లెక్కేమీకాదు : నక్క ఆనందబాబు

12
0

అమరావతి : వైపీపీ డబుల్ గేమ్ ఆడుతోందని వేమూరు శాసన సభ్యులు నక్క ఆనందబాబు ఆరోపించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ పేటెంట్ అన్నారు. ఇది జగమెరిగిన సత్యం అన్నారు. గతంలో ‘నా మైనారిటీలు, నా ముస్లింలు’ అని పదే పదే చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని అందలమెక్కారని, నేడు మళ్లీ వారి ఓట్ల కోసం జగన్‌రెడ్డి రకరకాల నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ముస్లింలకు జగన్ ద్రోహం చేశాడని అన్నారు. ముస్లిం సమాజానికి సంబంధించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంట్ సాక్షిగా డబుల్ గేమ్ ఆడుతుందని అన్నారు. మోడీ అరెస్టు చేయిస్తాడేమోననే భయం ఒకపక్క, ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కడ పోతాయోననే భయం మరోవైపు ఉందని అన్నారు.

పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకం అని, లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్ జారీ చేశారని అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటివరకు ఓటింగ్ అయిన తర్వాత విప్ జారీ చేసిన సంఘటనలు గాని జారీ చేసిన పార్టీలు గాని లేవని అన్నారు. ముస్లింల విషయంలో జగన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించారు. జగన్ చేసిన మోసం దేశమంతా చూస్తోందని అన్నారు. నేషనల్ మీడియా కోడై కూస్తోందని అన్నారు. జగన్ సూచనలతో రాజ్యసభలో వైసీపీ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారని, ఎన్డిఏ ప్రభుత్వానికి లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉందని. జగన్ ఏ స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్‌కి రాజ్యసభలో కట్టుబడి ఉండాలని అన్నారు. జగన్ కప్పదాటు వ్యవహారం చేశాడని అన్నారు. ఇది ముస్లింలను మళ్లీ మోసం చేయడం కాదా? వ్యతిరేకంగా ఓటు చేయమని విప్ జారీ చేశానని జగన్ అంటూనే మళ్ళీ విప్ వెనక్కి తీసుకున్నారని అన్నారు. అసలు వైసీపీ ఎంపీల స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేదని అన్నారు. ఒక రాజకీయ పార్టీకి ఒక అంశంపై స్పష్టమైన అవగాహన ఉండాలని, ఒక స్టాండ్ తీసుకోవాలని అననారు.

తెలుగుదేశం ఎన్డిఏ కూటమి భాగస్వామి పక్షాలుగా పూర్తి స్టాండుతో ఉన్నాయని అన్నారు. ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదనేదే చంద్రబాబు ఆలోచన అన్నారు. వక్ఫ్ క్లాజ్‌ల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం చర్చించి అనేక రకాలుగా బిల్లుకు సవరణలు ప్రతిపాదించినట్లు తెలిపారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపీసీ) ముందు అనేక సవరణలు ప్రతిపాదించి, ఆ సవరణలు అన్నీ దగ్గరుండి అంగీకంచేలా చేయించారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో వారి అభిప్రాయాలు చెప్పాయని, వైసీపీ, జగన్ స్టాండ్ ఏంటో బయటకు చెప్పలేదని అన్నారు. లోపల ఒకలా, బయట ఒకలా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో ముస్లిం సమాజం పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని అన్నారు. ఏ వైషయమైన చంద్రబాబులా డైరెక్టుగా చెప్పాలని, అలా కాకుండా బయటకు ఒకటి చెప్పి లోపల ఒకటి చేశారుని ఆరోపించారు జగన్ తన ఎంపీల చేత రాజ్యసభలో ఎందుకు అనుకూలంగా ఓటు వేయించావు? జగన్ మీద ఉన్న కేసులు భయంతోనే ఇలా వ్యవహరించి ఉంటాడని ఆరోపించారు. కేంద్రానికి జగన్ భయపడతాడని, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకంత భయమో? జగన్ తీసుకున్న స్టాండ్ కి గట్టిగా నిలబడలేని పరిస్థితి ఉందని, ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్నాడుని అన్నారు.

టీడీపీ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండాలన్న అంశాన్ని వ్యతిరేకించామని తెలిపారు. కలెక్టర్ల స్థాయి అధికారుల నియామకం రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నామని తెలిపారు. జేపీసీలో దాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ విధంగా దాదాపు నాలుగు సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేయించుకున్నట్లు తెలిపారు. టీడీపీ బాధ్యతాయుత పార్టీ అని, వైసీపీ డబల్ రోల్ ప్లే చేసిందని, వైసీపీకి ఏది చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉందని ఆనందబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో మోసమే ఎజెండాగా పెట్టుకొని పని చేసిన వైసీపీ స్టాండ్ చెప్పే ధైర్యం లేని పార్టీ అని, చేతకాని నాయకుడు జగన్ అనేది ఇయ్యాల అర్థం అయిందని అన్నారు. ముస్లిం నేతలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించాలని కోరారు. వైసీపీ హయాంలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయని అన్నారు. అనేక దమనకాండలు చేశారని అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఏ విధంగా చనిపోయిందో అందరికీ తెలుసని అన్నారు. మిస్బా కేసు ఏ విధంగా జరిగిందో చూసామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో మత కలహాలు సృష్టించి అధికార మార్పిడి కోసం ఏ విధంగా ఊచకోత కోశారో అందరికీ తెలిసిందే.నని అన్నారు. ముస్లిం సమాజాన్ని వాటన్నిటిని సరిచేసి మత కలహాలు అనేది లేకుండా మత సామరస్యాన్ని తెలుగుదేశం, చంద్ర బాబు కాపాడారని అన్నారు. కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు 3500 వక్ఫ్ ఆస్తులు డిజిటైషన్ చేసినట్లు తెలిపారు. జగన్ జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వివాదాస్పదం చేశాడని అన్నారు.