Home ప్రకాశం వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో 25వ రోజు 200మందికి ఆహారం పంపిణీ

వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో 25వ రోజు 200మందికి ఆహారం పంపిణీ

198
0

కందుకూరు : కరోనా లాక్ డౌన్ సందర్భంగా పనులు లేక ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న సంచార జాతులవారికి కొంతైనా ఆకలి తీర్చాలని వాసవి సేవాదళ్ ముందుకొచ్చింది. కందుకూరు సిఐ విజయ్ కుమార్ చేతులమీదుగా సంచార జాతుల వారికి ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ధైర్యంగా బయటకు వచ్చి, మండుటెండలో నేటికి 25రోజులుగా ప్రతిరోజు ఏదోఒక సేవా కార్యక్రమం చేస్తూ షుమారు 200వందల మందికి ఆహారం అందిస్తున్న వాసవి సేవాదళ్ టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్స్ ప్రతినిధులు ఎవి రావు, ఐవి సుబ్బారావు, సాయిరాం టీచర్ల బృందం సహాయ సహకారంతో విప్పగుంట రోడ్డులోని పేదలకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకటకేశవరావు, చలంచర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, సైకాలజిస్ట్ పసుపులేటి పాపారావు, కె మనోజ్, ఇస్కాల మధు పాల్గొన్నారు.