కందుకూరు : కరోనా లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న సంచార జాతులవారికి 29వ రోజు కూడా 200మందికి వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో ఆహారం అందజేశారు. యు వెంకటేశ్వర్లు, సేవాదళ్ బృందం అద్వర్యలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పులిహోర, పెరుగన్నం, బజ్జి, స్వీట్, అరటికాయలు పేదలకు, వ్యవసాయ మార్కెట్ సిబ్బందికి, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ కోశాధికారి చక్కా వెంకటకేశవరావు, చలంచర్ల సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ కోలా చంద్రశేఖర్, సైకాలజిస్ట్ పసుపులేటి పాపారావు, ఇస్కాల మధు, శశాంక్, కె మనోజ్, అమరనాద్ పాల్గొన్నారు.