– 400 ప్యాకెట్స్ అన్నదానం
– చీరాల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉన్న పేదలకు
– స్వర్ణ రోడ్లోని కాలవ గట్టుపై పేదలకు పంపిణీ
చీరాల : అపదలోఉన్న పేదలకు చేయూత నివ్వటం ప్రతిఒక్కరి ధర్మమని, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం అంటే భగవంతునికి సేవచేయటమేనని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, ఇతర పేదలు పనులు లేక, ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న వారికి గురువారం ఆహార పోట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ క్షీరపురి వ్యవస్థాపకులు అడ్డగడ్డ మల్లికార్జున్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది, తోట కిరణ్ పాల్గొన్నారు.