Home ప్రకాశం కష్టకాలంలో పేదలకు ఆహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత : తాడివలస దేవరాజు

కష్టకాలంలో పేదలకు ఆహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత : తాడివలస దేవరాజు

299
0

చీరాల : కష్టకాలంలో పేదలకు ఆహారం అందజేసి కొంత మేర చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో కనుమూరి జనార్దన్ రావు, రమాదేవి దంపతుల సహకారంతో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు ఈపురుపలెం, మత్స్యకార కుటుంబాలకు, పేరాల వద్ద ఉన్నటువంటి నిరుపేదలకు 420సాంబార్ అన్నం పాకెట్స్, అరటి పండ్లు పంపిణీ చేశారు.


అపదలోఉన్న పేదలకు చేయూత నివ్వటం ప్రతిఒక్కరి బాధ్యతని గాయత్రి పరివార్ అధ్యక్షులు కారుమూరి జనార్దన్ రావు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, ఇతర పేదలు పనులు లేక ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న వారికి సోమవారం ఆహార పోట్లాలను పంపిణీ చేశారు.

సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డగడ్డ మల్లికార్జునరావు మాట్లాడుతూ కరోనా మానవాళికి తీరని కష్టాలను తెచ్చి పెట్టిందన్నారు. అయినప్పటికీ అందరం ధైర్యంతో దీనిపై పోరాడి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. పేదలు అధైర్యపడవద్దని త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు. లాక్డౌన్ కాలంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ ఫాస్టర్, అన్నవరం, మహంకాళి, నరేంద్ర, మురళి, వంశీ, నరేంద్ర, ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.