చీరాల : పేదలకు ఆహారం అందజేసి కష్టకాలంలో కొంత మేరకైన చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో అడ్డగడ్డ మల్లికార్జున్, శ్రీ కామాక్షి కెరే హాస్పిటల్ సహకారంతో ఈపురుపలెం, పేరాల వద్ద ఉన్నటువంటి నిరుపేదలు 390కి ఆహార పాకెట్స్, అరటి పండ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ క్షిరపురి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డగడ్డ మల్లికార్జున్, డాక్టర్ విజయ్ కుమార్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.