Home ప్రకాశం బలరాం ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలు పంపిణి

బలరాం ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలు పంపిణి

293
0

చీరాల : రాష్ట్ర ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామక్రిష్ణమూర్తి, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేట, దేవాంగపురి గ్రామ పంచాయితీ బివి సుబ్బారావు కాలనీ వద్ద ఆదివారం మాజీ ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీలోని 4వ వార్డ్ గణేష్ యూత్ యువకులు బివిఎస్ కాలనీలోని 250 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా ఆ కాలనీ వాసులందరికీ జంజనం శ్రీనివాసరావు స్వయంగా మాస్కులు తయారుచేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణిచే పంపిణి చేశారు. కార్యక్రమంలో నాయకులు పృద్వి ధనుంజయ, సిద్ధి బుచ్చేశ్వరావు, సప్రం సోమశేఖరరావు, నాసిక జగన్ మోహన్ రావు, రేణుక, గుంటి శ్రీను, పేరాల 4వ వార్డ్ నాయకులు అవ్వారు సాంబశివరావు, తాళ్లూరి తులసీదాస్, బండారు శ్రీను, గణేష్ యూత్ పాల్గొన్నారు.