Home ప్రకాశం కరోనా లాక్ డౌన్ లో చీరాల ప్రజల్ని ఆదుకుంటాం : కరణం యువసేన

కరోనా లాక్ డౌన్ లో చీరాల ప్రజల్ని ఆదుకుంటాం : కరణం యువసేన

292
0

– వెంకటేష్ ఆదేశాలతో రంగంలోకి యువసేన
– పెద్ద ఎత్తున ఆహార పొట్లాల పంపిణీ
– డోర్ లాక్ కొనసాగినంత కాలం పేదలకు ఆహారం అందజేసేలా సన్నాహాలు
చీరాల : శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, ఆయన తనయుడు వెంకటేష్ తమ ఉదారతను చాటుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న చీరాల నియోజకవర్గ పేదలకు ఆహారం సరఫరా చేయాలని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, ఇతర పేదలు పనులు లేక ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారం అందజేయాలని నిర్ణయించారు. వెంకటేష్ ఆదేశాలతో కరణం యువసేన సభ్యులు రంగంలోకి దిగారు. ప్రాంతాల వారీగా పేదలను గుర్తించారు. వారందరికీ కరణం కుటుంబం సొంత డబ్బుతో ఆహారం సమకూర్చింది. ఆహార పొట్లాలను యువసేన సభ్యులు బుధవారం పేదలకు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ చీరాల ప్రజలకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కష్టకాలంలో పేదలకు అండగా ఉండటం తమ బాధ్యతని చెప్పారు. డోర్ లాక్ కొనసాగినంత కాలం ఆహార పంపిణీని కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలు అధైర్యా పడవద్దని కరోనాను అరికట్టటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చీరాలలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెల కట్టలేనివన్నారు. ఇటువంటి అపదకాల సమయంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు పేదలను అడుకోవటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాచ్ రమేష్, కరణం యువసేన సభ్యులు పాల్గొన్నారు.