చీరాల : సీపీఎం 49వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నడిచి, సైకిల్ పై వెళ్లే వలస కార్మికులు 200మందికి వెజిటబుల్ బిర్యానీ, మజ్జిగ, మంచినీళ్లు ఇచినట్లు కమిటీ కార్యదర్శి గందవళ్ళ బాలక్రిష్ణ తెలిపారు. సీపీఎం నగర నాయకురాలు కె రమాదేవి మాట్లాడుతూ లాక్ డౌన్ విధించడంలో కఠిన నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను వాళ్ల సొంత రాష్ట్రాలకి పంపే విషయంలో రాష్ట్రాలకి వదిలేసిందని అన్నారు.
కేరళ తప్ప ఎన్నికలప్పుడు ఓట్ల కోసం పాకులాడే మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు వలస కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. బెంగాల్ కార్మికులు మనిషికి రూ.5వేలు పెట్టి సొంతవాహనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ అనుమతి కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా వలస కార్మికులను వాళ్ల నివాసాలకు చేరుకునే వరకు ప్రభుత్వాలు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ వి మాలకొండయ్య, పాపని సుబ్బారావు, కె గురుస్వామి, ఎం శ్రీనివాసులు, టీ వీరయ్య, వి కాశిం, ఎం ప్రసాద్, రమేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, నాయకులు పి రాంబాబు పాల్గొన్నారు.