Home ప్రకాశం కరణం యూత్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ

కరణం యూత్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ

236
0

చీరాల : వైస్సార్సీపీ యువనాయకులు కరణం వెంకటేష్ యూత్ ఆధ్వర్యంలో రామకృష్ణాపురం గ్రామంలోని వడ్డెర సామాజికవర్గానికి చెందిన 21మందికి, జాణ్డ్రపేట రైల్వేస్టేషన్ లో అనాధలు, భిక్షాటన ద్వారా జీవించు 10మందికి, 9వ వార్డులో ఇద్దరికీ, 10వ వార్డులో 8మందికి మొత్తం 43మందికి శుక్రవారం భోజనాలు వారివద్దకు వెళ్లి అందించారు. కార్యక్రమాన్ని వైస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, డాక్టర్ అమృతపాణి, మాజీ ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపిపి చల్ల జనార్దనరావు పర్యవేక్షణలో కరణం వెంకటేష్ యూత్ ఆర్గనైజషన్ ప్రతినిధులు కోనాంగుల రమేష్ బాబు పంపిణీ చేశారు.