Home ప్రకాశం జంజనం ఆధ్వర్యంలో కరణం ఆపన్నహస్తం కరోనా కష్టకాలంలో నిరంతర భోజనాల పంపిణీ

జంజనం ఆధ్వర్యంలో కరణం ఆపన్నహస్తం కరోనా కష్టకాలంలో నిరంతర భోజనాల పంపిణీ

342
0

చీరాల : కరోనా వైరస్ మహమ్మారిగా పట్టి పీడిస్తున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ముందుగా గత మార్చి 22నుండి ఈ రోజుకు దఫాల వారీగా లాక్ డౌన్ ప్రకటించి మనందరినీ కరోనా మహమ్మారి నుండి కాపాడుచున్నారని చేనేత నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు పేర్కొన్నారు.

వైసిపి యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు తలపెట్టిన ఆపన్న హస్తం కార్యక్రమంలో భాగముగా చీరాల, వేటపాలెం మండలం బైపాస్ ప్రక్కన గల కొణిజేటి చేనేతపురిలో ప్రముఖ చేనేత నాయకులు, మాజీ ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏప్రిల్ 21నుండి ఈ రోజు వరకు స్వయంగా భోజనాలు తయారు చేయించి పలు ప్రాంతాలలో వృద్దులకు పంపిణీ చేశారు. మే 29న కొంజేటీ చేనేతపురి, లక్షీపురం, దేశాయిపేటలోని శారదా కాలనీ, సర్వోదయ కాలనీ, ఐటిఐ కాలనీలలోని పేదలను గుర్తించి భోజనాలు అందజేశారు. జంజనం శ్రీనివాసరావు తన ఇద్దరు అల్లుళ్ళు గట్టు బాలసుబ్రమణ్యం, గట్టు మనోజ్ కుమార్, కుమార్తెలు ఉమాదేవి (లండన్), మాధురి (అమెరికా) సహాయముతోపాటు బాల హ్యాండ్లూమ్స్ అధినేత బండారు బాలనాగేశ్వరరావు, మిత్రులు, శ్రేయోభిలాషుల ఆర్థిక సహాయ సహకారములతో ఆ ప్రాంతములలో ప్రతిరోజూ వంటలు చేయించి 475 మందికి పంపిణి చేసారు.

చీరాల మండలం ఈపూరుపాలెంలోని పద్మనాభుని పేట, 40ఇళ్ళు ఏరియాలో, దండేయ కాలనీలో, అవ్వారు మహాలక్ష్మి, సుబ్బారావు కాలనీ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నివాసముంటున్న షుమారు 635 మందికి భోజనాలు పంపిణీ చేసారు. రెండు మండలంలో 1110మందికి భోజనాలు పంపిణీ చేశారు.

*డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు ఆర్ధిక సహాయం*
కరోనా సమయంలో ఆపన్నహస్తం కార్యక్రమానికి హైమ హాస్పిటల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు ఆర్థిక సహాయం అందజేశారు. జంజనం శ్రీనివాసరావు పెద్ద అల్లుడు గట్టు బాలసుబ్రమణ్యం, కుమార్తె ఉమాదేవి గార్ల స్నేహితులైన కేరళ వాసితులు గణేష్, ప్రియాంకల కుమార్తె రిషిక జన్మదినం సందర్బంగా ఈ రోజు నిరుపేదలకు అన్న ప్రసాదము ఏర్పాటుకు విరాళములు సమకూర్చారు. అమెరికాలో ఉంటున్న చిన్న అల్లుడు మనోజ్ కుమార్, మాధురి, బంధువులు ఆర్ధిక సహకారం అందజేశారని తెలిపారు.

కార్యక్రమంలో చేనేత కార్మిక నాయకులు అనుభం వెంకటేశ్వర్లు, బండారు జ్వాలా నరసింహారావు, నాదెండ్ల కోటేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు, అందే సాంబయ్య, బూదాటి నాగేశ్వరావు, కూరపాటి శంకర్, శేషు, అవ్వారు బాలకృష్ణ, వేటగిరి సంజీవరావు పాల్గొన్నారు.