Home ప్రకాశం ఏఎంసీ మాజీ చైర్మన్ జనం ఆధ్వర్యంలో కరణం ఆపన్నహస్తం భోజనాలు పంపిణీ

ఏఎంసీ మాజీ చైర్మన్ జనం ఆధ్వర్యంలో కరణం ఆపన్నహస్తం భోజనాలు పంపిణీ

333
0

చీరాల : కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి మనందరికీ విదితమే. అందులోభాగంగా మన ప్రధానమంత్రి మోడీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ముందుగా గత మార్చి నెల 22నుండి ఈ రోజుకు దశల వారీగా లాక్ డౌన్ ప్రకటించి మనందరినీ కరోనా మహమ్మారి నుండి కాపాడుచున్నారు. ఈ నేపథ్యంలో మన యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు తలపెట్టిన ఆపన్న హస్తం కార్యక్రమంలో భాగముగా మన చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం బైపాస్ ప్రక్కన గల కొణిజేటి చేనేతపురిలో చేనేత నాయకులు, మాజీ ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏప్రిల్ 21నుండి ఈ రోజు వరకు స్వయంగా భోజనాలు తయారు చేయించి వేటపాలెం మండలంలోని పలు ప్రాంతాలలో షుమారు 420మంది వృద్దులకు పంపిణీ చేశారు. అందులో భాగములో 27న కొంజేటీ చేనేతపురి, మాచర్ల మోహనరావు కాలనీ, దేశాయిపేటలోని విగ్నేశ్వర కాలనీ, రామన్నపేట పంచాయతీ పార్వతీపురంలోని గిరిజనులకు, వివిధ ప్రాంతాలలోని పేద వారిని గుర్తించి భోజనం అందజేశారు.

చేనేత నాయకులు, మాజీ ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన కుమార్తెలు ఎన్ఆర్ఐల సహాయముతో, బాల హ్యాండ్లూమ్స్ అధినేత బాలనాగేశ్వరరావు, మిత్రులు, శ్రేయోభిలాషుల ఆర్థిక సహాయ సహకారములతో వంట చేయించి షుమారు 580మందికి భోజనాలు ఏర్పాటు చేసి పంపిణి చేశారు.

చీరాల మండలం ఈపూరుపాలెంలోని పద్మనాభునిపేట, 40ఇళ్ళు ఏరియా, పురుగులపేట, దండేయకాలనీ ప్రాంతాలలో కూడా షుమారు 540 మందికి పంపిణీ చేసారు. రమారమి రెండు మండలంలో 1120మందికి భోజనాలు పంపిణీ చేయుట జరిగింది. ఈ కార్యక్రమమునకు నాదెండ్ల కోటేశ్వరరావు, బండారు శ్రీనివాసరావు, చేనేత కార్మిక నాయకులు అనుభం వెంకటేశ్వర్లు, కూరపాటి శంకర్, శేషు, బూదాటి సాంబయ్య, అవ్వారు బాలకృష్ణ, నాదెండ్ల సురేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.