టంగుటూరు : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్బంగా ప్రకాశం జిల్లా మత్స్య శాఖ ఆర్దిక సహకారంతో మంజూరైన చేపల వాహనాన్ని ఎంఎల్ఎ డోలా బాలవీరాంజనేయులు లబ్దిదారుడైన ఎం.నిడమానూరుకు చెందిన పిడుగురాళ్ల సురేష్‌బాబుకు, జయవరం గ్రామానికి చెందిన చుండి రాజుకు వాహనాలను అందజేశారు. ఒక్కొక్క వాహనానికి మత్య్సశాఖ రూ.4.44లక్షలు రుణం మంజూరు చేయగా వీటిలో రూ.3.96లక్షలు సబ్సిడీ ప్రకటించారు. పెద్దమొత్తంలో వాహనానికి సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేయడంపట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఒంగోలు ఎంఎల్ఎ, టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఎం.నిడమనూరు మాజీ సర్పంచి పిడుగురాళ్ల గోవిందమ్మ, టంగుటూరు మండల టిడిపి ఎస్సిసెల్ ప్రధాన కార్యదర్శి కోమ్ము వెంకటరావు, కాకుటూరివారిపాలెం గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి లింగాల బాలకోటయ్య పాల్గోన్నారు.