ఒంగోలు : సెల్ ఫోన్ దుకాణంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.18లక్షల విలువైన వస్తువులు దగ్దమయ్యాయి. ఒంగోలు పట్టణం ట్రంకురోడ్డులోని శ్రీరాజరాజేశ్వరి సెల్ వరల్డ్ ఎలక్రానిక్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్సర్కూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 6.30 గంటల సమయం ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో దుకాణంలో ఎవరు లేనందున ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. దుకాణంలోని ఫర్నీచర్తోపాటు సెల్ఫోన్న్లు, మొబైల్ ఎక్ససరీస్ పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ ఇన్ఛార్జ్ డిపి చౌదరి సిబ్బందితో ఘటన స్ధలానికి చేరుకున్నారు. మంటలు అదుపుచేశారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి సంఘటన స్ధలానికి చేరుకున్నారు. దుకానదారున్ని పరామర్సించారు. సుమారు రూ.18లక్షల మేరకు ఆస్ధి నష్టం వాటిల్లిందని దుకానదారుడు ఆవేదన వ్యక్తంచేశారు.