చీరాల (Chirala) : జాతీయ స్థాయి థైక్వాండో క్రీడా పోటీలకు ఎంపికైన కెజిఎం బాలికోన్నత పాఠశాల విద్యార్ధిని షేక్ తాహిరాకు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.25వేల ఆర్ధిక సహాయం అందజేశారు. స్థానిక ఎన్‌విఎస్ అండ్ ఎస్‌జెఆర్ ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు ఎన్‌ఆర్ అండ్ పిఎం హైస్కూలు వాకర్స్ అసోసియేషన్ (NRPM High School Walkers Association) సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ 203వ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్ది శివరామ ప్రసాద్, ట్రెజరర్ లఘువరపు సత్యనారాయణ హాజరై మాట్లాడారు. చీరాల వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అసోసియేషన్ సేవలకు మరికొన్ని అవార్డులు బహుకరించారు.
కెజిఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థిని షేక్ తాహిరా తైక్వాండో స్టేట్ గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికైనది. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్‌లో ఈనెల 26 నుండి డిసెంబర్ 2 వరకు జరుగనున్న తైక్వాండో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఖర్చుల నిమిత్తం నగదు సహాయం అందజేశారు. మరిన్ని బంగారు పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, శివ రామప్రసాద్, లయన్ మద్దు వెంకట సుబ్బారావు, చేబ్రోలు బాబాజీరావు, సుభాషిణి, గోపు సాంబశివరావు, అమరా వీరాంజనేయులు, గుర్రం బద్రినాథ్, చింతా రమేష్, డివి సురేష్, దరియా సాహెబ్, నాగ వీరభద్రాచారి, సుధాకరరావు, లాల్, డాక్టర్ బాబూరావు పాల్గొన్నారు.




