హైదరాబాద్: అక్టోబర్ 1 నుంచి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సిసి) రీ- ఓపెనింగ్ కానుంది. కరోనా మహమ్మారి భయాలతో సినీ పరిశ్రమ మూతపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే స్టార్లు షూటింగులకు రెడీ అవుతుంటే త్వరలోనే థియేటర్లు తెరిపించేందుకు కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు సమాచారం.
తాజాగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సిసి) రీ- ఓపెనింగ్‌కి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 1 తేదీ నుంచి నుంచి అల్పాహారం, ఎగ్జిక్యూటివ్ లంచ్, టేక్-అవే ఫుడ్, సండే బఫే, స్పోర్ట్స్ విభాగం, స్పాతో పాటు గెస్ట్ రూమ్‌లతో ఎఫ్.ఎన్.సి.సి తెరిచి ఉంటుంది. కోవిడ్ -19 జాగ్రత్తలు పాటిస్తూ ఐడీ కార్డు ఉన్న సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. ప్రవేశానికి ఫేస్ మాస్క్, టెంపరేచర్ థర్మల్ తనిఖీ ఏర్పాట్లు ఉంటాయి. అతిథులను మాత్రం ఖచ్చితంగా అనుమతించరని ఎఫ్.ఎన్.సి.సి నిర్వాహకులు స్పష్టంచేశారు.