Home ప్రకాశం పండుగలు సంస్కృతికి ప్రతీక : కెవిపిఎస్, యుటిఎఫ్, డివైఎఫ్ఐ, జెవివి, ఎస్ఎఫ్ఐ

పండుగలు సంస్కృతికి ప్రతీక : కెవిపిఎస్, యుటిఎఫ్, డివైఎఫ్ఐ, జెవివి, ఎస్ఎఫ్ఐ

439
0

చీరాల : పండుగలు తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని జెవివి రాష్ట్ర కార్యదర్శి కుర్ర రామారావు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గౌరవ తిన సూరిబాబు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక యుటిఎఫ్ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొత్తపేట వివేకానంద కాలనీ లో ఆదివారం ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలో కాలనీవాసులు ఆసక్తిగా కాలనీవాసులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కెవిపిఎస్ డివిజన్ కార్యదర్శి లింగం జయరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ పండుగలు జరుపుకోవడం అంటే మానవ సంబంధాలను అభివృద్ధి చేస్తా అన్నారు. ఆధునిక సమాజంలో వినోద సమాచార కార్యక్రమాలన్నీ ఇంటికే పరిమితం కావడం వల్ల పొరుగింటి వారితోనూ సరైన పరిచయాలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చుట్టూ జనం ఉన్న ఒంటరి జీవనం గడిపే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే పండుగలు సాంప్రదాయాలను కొనసాగించాలని చెప్పారు. ఆటలు యువతలో ఐక్యత భావాలను పెంచుతాయి అన్నారు. సభ అనంతరం ముగ్గుల పోటీలు కుర్చీలాట బిందెలో నిమ్మకాయ ఆటలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. సభలో యుటిఎఫ్ జిల్లా నాయకులు కె వీరాంజనేయులు, షేక్ జానీభాష, కుర్ర శ్రీనివాసరావు, ఎం వసంతరావు, సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు, డివైఎఫ్ఐ కార్యదర్శి పి సాయిరాం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి చరిత, యుటిఎఫ్ మహిళా నాయకురాలు లింగం సరలకుమారి, దయానంద్ పాల్గొన్నారు.