Home బాపట్ల సిఐటియుతో ఫెడరేషన్‌ అనుబంధం రద్దు

సిఐటియుతో ఫెడరేషన్‌ అనుబంధం రద్దు

35
0

చీరాల (Chirala) : ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఐఎల్‌టిడి కంపెనీ వర్కర్స్ (రిజిస్టర్ 3249 రికగ్నైజ్డ్) రాష్ట్ర మహాసభ మే ఒకటిన ఈపురుపాలెం ఆటోనగర్‌లో చిప్పలపల్లి శివరాజు అధ్యక్షతన నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ మహాసభలో నూతనంగా రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా చిప్పలపల్లి శివరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గంట సుధీర్‌, రాష్ట్ర కోశాధికారిగా పఠాన్‌ నాగుల్‌మీరా ఎన్నికైనట్లు తెలిపారు. మహాసభలో సిఐటియుతో ఫెడరేషన్‌ అనుబంధం రద్దు చేసుకునేందుకు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. మొత్తం 25 మందితో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్‌ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు గుంటూరులోని ఐఎల్టిడి కంపెనీ ఇఆర్ఎం టిఎ పవన్ కుమార్‌ను కలిసి పరిచయం చేసుకున్నట్లు తెలిపారు. ఐఎల్టిడి ఫ్యాక్టరీ మేనేజర్ శ్యాంసుందర్, పర్సనల్ మేనేజర్ రామకృష్ణను కలిసి పరిచయం చేసుకున్నారు.