ఒంగోలు : ఆన్ లైన్ ఇ-ఫార్మసీ విధానం ద్వారా ఇంగ్లీషు మందులు అమ్మకాలకు కేంద్రప్రభుత్వం అనుమతించడానికి నిరసనగా సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ షాపులు బంద్ చేశారు. షాపుల యజమానులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆన్ లైన్ ఇ-ఫార్మసీని వ్యతిరేకించండంటూ నినాదాలుచేస్తు ట్రంక్‌రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. మందుల షాపుల బంద్‌తో నగరంలోని అన్ని మెడికల్ షాపులు మూతపడ్డాయి.