Home బాపట్ల రామానంద సరస్వతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన

రామానంద సరస్వతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన

137
0

– వేకువ జామునుండే క్యూ కట్టిన షుగర్ బాధితులు
– 1276 మందికి ఉచిత వైద్య పరీక్షలు
– ఉచితంగా రెండు నెలలకు సరిపడు మందులు పంపిణీ
– అల్పాహారం, తాగు నీటి వసతుల కల్పన
– జూన్ 22న మళ్ళీ క్యాంపు నిర్వహణ
చీరాల : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో షుగరు వ్యాధికి ఉచిత వైద్య శిభిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిభిరంలో వివిధ ప్రాంతాల నుండి వేకువ జాము నుండే వచ్చిన 1276 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. రెండు నెలలకు సరిపడు మందులు ఉచితంగా అందజేసినట్లు ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. శిభిరానికి హాజరైన వారందరికి అల్పాహారం, తాగునీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేశారు. షుగర్ వ్యాధి బాధితులు ఎక్కువ సమయం వేచి ఉండ కుండా వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శిభిరానికి వచ్చిన వారందరికి వేగంగా వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి త్వరగా పరీక్షలు చేసినట్లు తెలిపారు. త్వరగా సేవలు విధంగా విస్తృత ఏర్పాట్లతో మధ్యాహ్ననికే వచ్చిన వారందరికీ వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.

ఈ సందర్బంగా వైద్యులు రోగులకు షుగరు వ్యాధిపై అవగాహన కల్పించారు. వేసవిలో తీసుకోవాలసిన జాగ్రత్తలు వివరించారు. రోజువారీ జీవన విధానం మార్చుకోవాలని సూచించారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుందని చెప్పారు. మానసిక ఆందోళన తగ్గించుకోవాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు.

వైద్య శిభిరంలో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలా రాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ ప్రకాష్‌, డాక్టర్‌ పేట శ్రీకాంత్‌, డాక్టర్ ప్రకాష్ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్‌, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్‌, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, గోపాల్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చేశారు.