చిన్నగంజాం(DN5 News) : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిభిరం ప్రారంభంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి, నాగేశ్వరరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ శిబిరంలో 500 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 150 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సిఫార్సు చేశారు. శిబిరాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించారు. రోగులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మండలంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నట్లు తెలిపారు.






