కారంచేడు (Karamchedu) : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) సారధ్యంలో స్థానిక యార్లగడ్డ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్, నోవా అగ్రిటెక్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలు, పురుషులకు వేరువేరుగా కౌంటర్ల ద్వారా రక్త, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కంటి పరీక్షలు చేశారు. 425 మంది హాజరుకాగా 105 మందికి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు సూచించారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహానికి, ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు ప్రజలు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎపి ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమలశెట్టి శ్రీహరి, నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ హుస్సేన్, ఎపి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కృష్ణారావు మాట్లాడారు.
కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి గత 15 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశం అన్నారు. కంటి సమస్యలు జీవితాన్ని అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని అన్నారు. నియోజకవర్గంలో లక్ష మందికి కంటి చూపు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల వివిధ మండలాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాల్లో కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచిత కళ్లజోడులు, శస్త్రచికిత్స అవసరమైన రోగులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయడం ఎమ్మెల్యే ఏలూరి సేవ నిరతికి నిదర్శనం అన్నారు. పేద ప్రజలు ఖర్చుల భయంతో వైద్యం వాయిదా వేసుకోవద్దన్నదే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఏలూరి వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సామాజిక బాధ్యతగా రాజకీయాలకతీతంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పోతిన ఉదయ్ భాస్కర్, సర్పంచ్ బాలిగ శివ పార్వతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రత్తయ్య చౌదరి, కొత్తగొర్ల శ్రీరాములు, కంభంపాటి నరేంద్ర, పోతిన నాగేశ్వరరావు, మైలా బ్రహ్మయ్య, దగ్గుబాటి చౌదరి, రాయనీడి హనుమంతరావు, రామకృష్ణ, శాంతయ్య, యార్లగడ్డ శ్రీనివాసరావు, పోతిన రాజేంద్ర ప్రసాద్, కోసరాజు సురేంద్ర, ఖాసీం, బంగారు బాబు, పూర్ణయ్య, బ్రహ్మాజీ, చంద్రశేఖర్, రియాజ్ పాల్గొన్నారు.






