Home బాపట్ల ఉచిత షుగర్ వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత షుగర్ వైద్య శిబిరానికి విశేష స్పందన

38
0

చీరాల (DN5 News) : శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఆశ్రమం ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత షుగర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వేకువ జామునుండే వివిధ ప్రాంతాల నుంచి షుగర్ బాధితులు భారీగా తరలివచ్చారు. శిబిరంలో 1216 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి నెల రోజుల పాటు సరిపడే మందులు ఉచితంగా అందజేశారు. శిబిరానికి హాజరైన వారికి ట్రస్ట్ ప్రతినిధులు అల్పాహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. బాధితులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతంగా పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ షుగర్ బాధితులు కేవలం మందులపైనే ఆధారపడ కుండా జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి తగ్గించడం, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడక, వ్యాయామం అలవాటు చేసుకుంటే వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని వివరించారు. శిబిరంలో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలా రాజేశ్వరి, డాక్టర్‌ లలిత్ ప్రకాష్, డాక్టర్‌ పేట శ్రీకాంత్, డాక్టర్‌ ప్రకాష్ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్, కె లింగరాజు, మోహన్, మిత్ర ల్యాబ్ ప్రతినిధులు, రెడ్ క్రాస్ చైర్మన్ బుదరాజు శశికిరణ్, రెడ్‌క్రాస్‌ సభ్యులు త్రోవగుంట అబ్దుల్, వాడరేవు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు పాల్గొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.