Home బాపట్ల ఉచిత షుగరు వైద్య శిభిరానికి విశేష స్పందన

ఉచిత షుగరు వైద్య శిభిరానికి విశేష స్పందన

43
0

• వేకువ జామునుండే హాజరైన షుగర్ బాధితులు
• 1181 మందికి ఉచిత వైద్య పరీక్షలు
• నెలకు సరిపడు మందులు ఉచితంగా పంపిణీ
• అల్పాహారం, తాగు నీటి వసతులు కల్పించిన ట్రస్ట్ ప్రతినిధులు
చీరాల (DN5 News) : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో షుగరు వ్యాధికి ఉచిత వైద్య శిభిరం ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వేకువ జాము నుండే వచ్చిన 1181 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అవసమైనా వారికి నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా అందజేసినట్లు ఆశ్రమ మేనేజర్‌ నారాయణం సురేష్‌ తెలిపారు. శిభిరానికి హాజరైన వారందరికి అల్పాహారం, తాగునీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేశారు. షుగర్ వ్యాధి బాధితులు ఎక్కువ సేపు వేచి ఉండ కుండా వేగంగా వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి త్వరగా పరీక్షలు చేసినట్లు తెలిపారు.

షుగరు వ్యాధి బాదితులు కేవలం మందులపైనే ఆధారపడవద్దని, రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు చెప్పారు. అలా చేస్తే షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పారు. ఆహారపు అలవాట్లు మార్చు కోవాలని, మానసిక ఆందోళన తగ్గించు కోవాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు.

వైద్య శిభిరంలో డాక్టర్‌ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్‌ కమలా రాజేశ్వరి, డాక్టర్‌ లలిత్‌ ప్రకాష్‌, డాక్టర్‌ పేట శ్రీకాంత్‌, డాక్టర్ ప్రకాష్ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్‌ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్‌, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్‌, కె లింగరాజు, మోహన్, మిత్ర ల్యాబ్ వలి, గోపాల్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చేశారు.