టంగుటూరు(దమ్ము) : గడపగడపకు – మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు ఆద్వర్యంలో జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంనిర్వహిస్తున్నారు. టంగుటూరు మండలం వల్లూరులో ఆదివారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు 15000గడపలకు తిరగడం పూర్తైన సందర్భంగా ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ చేతులమీదుగా కేక్ కట్ చేశారు.
ముందుగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. పథకాలు అందని అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు, ప్రముఖ వ్యాపారవేత్త బీనీడి ఉదయకుమార్, హనుమారెడ్డి, కాలే శ్రీనివాసరావు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.