బాపట్ల (DN5 News) : జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ పరిశ్రమల ప్రగతిపై కలెక్టర్ వి వినోద్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల కోసం అందిన 55 దరఖాస్తులు పరిశీలించారు. సకాలంలో అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం (PMEGP) 2025-26 కింద ఇప్పటివరకు 163 యూనిట్లకు అనుమతులు మంజూరు చేసి, 815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందుకు రూ.4.36 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన MSME Entrepreneurship Development Policy 2024-29 కింద 20 తయారీ పరిశ్రమలకు స్థిరపెట్టుబడి సబ్సిడీ, విద్యుత్ రాయితీ, సేల్స్ టాక్స్ రాయితీ, పావలా వడ్డీ రాయితీ కింద రూ.1.60 కోట్ల రాయితీలు మంజూరు చేసినట్లు తెలిపారు. చీరాల APIIC ఆటోనగర్ ప్రాంతంలో పరిశ్రమల పేరు, కార్యకలాప మార్పుకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి వై రామకృష్ణ, APIIC జోనల్ మేనేజర్ నరసింహారావు, మునిసిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, FAPSIA ప్రతినిధి వి భక్తవత్సలం, LDM శివకృష్ణ, NABARD AGM, RTA పరంధామరెడ్డి, ఫ్యాక్టరీస్ విభాగం తరినాథరావు పాల్గొన్నారు.






