హైదరాబాద్ : నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పరిగాయని ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్టు వైరల్ అయ్యింది. ‘మొద్దు నిద్రలో తెలంగాణ హోంశాఖ విభాగం’ అంటూ ట్యాగ్ చేశారు. హైదరాబాద్ – చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పటాన్ చెరు నుండి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేస్తున్న ఒక వీడియో పోస్టు చేశారు. తమ కారుకు బస్సు తగిలిందని, బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ‘బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు’ అని ట్యాగ్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది.






