Home ప్రకాశం ప్రతిభా పురష్కార ఎంపికకు పరీక్షలు

ప్రతిభా పురష్కార ఎంపికకు పరీక్షలు

81
0

అద్దంకి : ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ఈనెల ఒకటిన నిర్వహించిన ఈఈఎంటి -2024 ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్షకు 7వ తరగతి విద్యార్థులు 6089 మంది హాజరుకాగా అందులో 40శాతంపైగా మార్కులు సాధించిన 1864మంది విద్యార్ధులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని ఎఫిఫని సంస్థ కన్వీనర్‌ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు 8583మంది హజరుకాగా అందులో 40శాతంపైగా మార్కులు సాధించిన 2372మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని అన్నారు. ప్రిలిమ్స్ ఫలితాలను ఆయనతోపాటు డాక్టర్‌ యు దేవపాలన, చిన్ని మురళీకృష్ణ, న్యాయవాది మహమ్మద్ రఫి సమక్షంలో విడుదల చేశారు. క్రింద కనపరచిన వెబ్ లింకుల ద్వారా మెయిన్స్‌కు అర్హత సాధించిన 7వ తరగతి,10వ తరగతి విద్యార్థుల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారందరికీ అభినందనలు తెలిపారు. మెరిట్ టెస్ట్ వ్రాయడానికి విద్యార్థులను ప్రోత్సహించిన మన విద్యాశాఖ కమీషనర్ ఎస్ సురేష్ కుమార్‌, డైరెక్టర్ బి ప్రతాపరెడ్డి, డైరక్టర్ పి పార్వతీ, మెరిట్ టెస్టు కన్వీనర్ విఎస్ సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపారు. మెయిన్స్ పరీక్ష రాయడం పట్ల అవగాహన కలిగించడానికి ఈనెల 6న మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోడ్ తంత్ర సాంకేతికత ద్వారా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల చేత ఆన్లైన్ ప్రోక్టరింగ్ పద్ధతిని ఉపయోగించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెయిన్స్‌ పరీక్షలో 50శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్ధులకు ఈఈఎన్టి 2024 బహుమతుల ఎంపికకు పరిగణించబడతారని తెలిపారు.