Home జాతీయం మాజీ స్పీక‌ర్ సోమ‌నాద్ ఛ‌ట‌ర్జీ ఇక లేరు

మాజీ స్పీక‌ర్ సోమ‌నాద్ ఛ‌ట‌ర్జీ ఇక లేరు

438
0

కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్‌, సుధీర్ఘ పార్ల‌మెంటేరియ‌న్‌ సోమనాథ్‌ ఛటర్జీ(89) సోమ‌వారం కన్నుమూశారు. గ‌త‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. ఈనెల 7 నుంచి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీల స‌మ‌స్య‌కు చికిత్స పొందుతూనే ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందజేశారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.

1968లో సీపీఎం స‌భ్య‌నిగా చేరిన సోమనాథ్ ఛ‌ట‌ర్జీ పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక‌య్యారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. యూపీఏ1 హయాంలో 2004 నుండి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వ‌హించారు. యూపీఏ-1 కూటమి నుండి సీపీఎం వైదొలిగిన‌ప్ప‌టికీ ఆయన మాత్రం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయకుండా కొన‌సాగారు. స్పీక‌ర్ ప‌ద‌వి రాజ‌కీయాల‌కు అతీత‌మైన‌ద‌ని వాద‌న చేశారు. త‌న‌కు వాద‌న‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టంతోపాటు అణుఒప్పందం అంశంలో పార్టీ నిర్ణ‌యానికి వ్య‌తిరేంగా వ్య‌వ‌హ‌రించడంతో పార్టీ నుండి 2008లో సీపీఎం బహిష్కరించింది.