టంగుటూరు (దమ్ము) : వృత్తిపట్ల నిబద్ధతతో ఎటువంటి వివాదాలు లేకుండా, ఎవరినీ నొప్పించకుండా అందరికీ అనుకూలంగా బ్రహ్మయ్య ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారని పిడిసిసి బ్యాంకు చైర్మన్, వైసిపి ఇంచార్జి డాక్టర్ వెంకయ్య అన్నారు. ఎంపీడీఓగా కూడా ఇక్కడ పనిచేశారన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ రావడంలోకొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటుటారని అటువంటి ఇబ్బందులు బ్రహ్మయ్యకు లేకుండా ఉన్నతాధికారులు చూడాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీడీఓ పనిచేసి ఈఓఆర్డీగా ఉద్యోగ విరమణ చేసిన నూతలపాటి బ్రహ్మయ్య, రాజేశ్వరి దంపతులను ఎంపీడీఓ కార్యాలయం వద్ద డాక్టర్ వెంకయ్య, అధికారులు, నాయకులు శాలువాలుకప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ, నియోజకర్గ కోవిడ్-19 ప్రత్యేకాధికారి పివి నారాయణ మాట్లాడుతూ బ్రహ్మయ్య ఎక్కడ పనిచేసినా అంకితభావంతో పనిచేశారని చెప్పారు. కరోనా విధుల్లో సైతం నిర్భయంగా పనిచేసారన్నారు. గతంలో పనిచేసిన మండలాలలోని ప్రజలు, అధికారులకు గుర్తుండిపోయేలా పనిచేసి మంచి వ్యక్తిగా నిలిచాడన్నారు. కిందిస్థాయి అధికారులు మాట్లాడుతూ అమ్మా, అయ్యా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ పనిలో మెళకువలు నేర్పిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలలో మమ్మల్ని బాగస్వామ్యుల్ని చేసేవాడిని పేర్కొన్నారు.
మాజీ ఎంపీడీఓ, ఈఓఆర్డీ నూతలపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ పేదరికంలో సైతం చిన్నతనం నుండి కష్టపడి మంచి మార్కులతో చదివేవాడినని, కావలి జవహర్ భారతి కాలేజీ పిడిఎస్యు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశానని చెప్పారు. తమ వివాహం కూడా వామపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఆ ఆలోచనతోనే అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి పడేలా ప్రభుత్వ సేవలు చేయగలిగానని అన్నారు. తన వృత్తి ప్రయాణంలో సహకారంగా ఉన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీడీఓ జమీఉల్లా అధ్యక్షత వహించిన ఉద్యోగ విరమణ అభినందన సభలో గ్రామ సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైస్సార్సీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, ఏఓ జి స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి జగదీష్ బాబు, ఆలకూరపాడు కార్యదర్శి బిల్లా అంకయ్య, వల్లూరమ్మ దేవాలయ మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి, వైస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, మండల నాయకులు మల్లవరపు కోటిరెడ్డి, బొడ్డపాటి అరుణ, హనుమారెడ్డి, వివిధ గ్రామాల కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.