టంగుటూరు (దమ్ము) : జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య సతీమణి, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు మాతృ మూర్తి పోతుల పేరమ్మ (85) శనివారం రాత్రి తన స్వగృహంలో మృతిచెందారు. పేరమ్మ మృతదేహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొండపి, అద్దంకి, పర్చూరు, చీరాల శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, ప్రముఖ పారిశ్రామిక వేత్త బెల్లం కోటయ్య, వైస్సార్సీపీ టంగుటూరు మండల కన్వనర్ సూదనగుంట హరిబాబు, టిడిపి మండల అధ్యక్షులు కామని విజయకుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, చిడిపోతు వెంకటేశ్వర్లు, పాపారావు పబ్లిక్ స్కూల్ అధినేతలు చిడిపోతు సిద్దార్థ, చిడిపోతు శిశిర్ చౌదరి, సూదనగుంట నారాయణ, చిడిపోతు సీతారామయ్య, మద్రాసు వెంకటేశ్వర్లు, ఐవి సుబ్బారావు, తన్నీరు వీరనాయణ, కసుకుర్తి శ్రీధర్, దేవరపల్లి మురళీకృష్ణ, చదలవాడ వేణు, రమణారెడ్డి, కోటిరెడ్డి తదితరులు నివాళులర్పించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం సాయంత్రం పేరమ్మ అంత్యక్రియలు జరిగాయి. పేరమ్మ అంత్యక్రియలలో కుమారులు పోతుల రామారావు, కృష్ణారావు, నరసింహరావు, ప్రసాద్, కుటుంబసభ్యులు, బంధువులు, పోతుల అభిమానులు పాల్గొన్నారు. చిన్న కుమారుడు ప్రసాద్ దహన సంస్కారాలను నిర్వహించారు.