టంగుటూరు : మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పోతుల పుట్టినరోజు సందర్భంగా ఆయన స్వగృహంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను పోతుల కట్ చేసి తన సోదరులైన మాజీ వైస్ ఎంపీపీ పోతుల నరసింహరావు, కృష్ణారావు, ప్రసాద్, అభిమానులకు పంచిపెట్టారు. తదనంతరం స్థానిక జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద వలస కూలీలకు అన్నం ప్యాకెట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో పోతుల రామారావు యూత్ ఫోర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.