చీరాల : గృహ లబ్దిదాదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామాన్ని మాజీ ఎమ్మెల్యే, నియెజకవర్గ వైసిపి బాద్యులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం వేటపాలెం మండలంలోని అబ్దుల్ కలాం కాలనిలో గృహ లబ్ధిదారులు, హోసింగ్, ఆరడబ్ల్యుఎస్, పంచాయితీ రాజ్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పక్కదారి మాలించారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో మంజూరైయి సగంలో నిలిచిన గృహ నిర్మాణాల లబ్దిదారులకు సైతం నిధులు మంజూరు చేయునునట్లు స్పష్టం చేశారు. అనంతరం స్థానికంగా నిర్మాణ దశలో వున్న అబ్దుల్ కలాం కాలనీ, వివేకానంద కాలనీలలో లబ్ధిదారుల నుంచి ఆయా కాలనిలలో సౌకర్యాలు, వసతులఫై అరా తీశారు. త్వరితగతిన కాలనీలలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు. సమావేశంలో హోసింగ్ డిఇ మాధవరావు, ఎఈ పుల్లయ్య, ఆరడబ్ల్యుఎస్ ఎఈ గిరి నాయక్, పంచాయితీ రాజ్ ఎఈ నాగేంద్రుడు వున్నారు.