చీరాల : పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత రిటెర్డ్ డియస్పి జయ రామసుబ్బారెడ్డికే దక్కుతుందని మాజీ ఏమ్మేల్యే ఆమంచి క్రిష్ణమోహన్ అన్నారు. పొలీస్ వ్యవస్దలో వివిధ హోదాలో పనిచేసిన అయన ప్రస్తుతం చీరాల డియస్పిగా విధులు నిర్వహీస్తు ఉద్యోగ విరమణ పోందారు. ఉద్యోగ విరమణ పోందిన జయరామ సుబ్బారెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆమంచి మార్యాద పూర్వకముగా కలిసి అభినందలు తెలిపారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ చీరాల సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పీగా సుధీర్ఘకాలం విధులు నిర్వహించన జయరామ సుబ్బారెడ్డి శాంతి భద్రతల విషయంలో ఏక్కడ రాజీ పడకుండ నిబ్దదతతో పని చేశారన్నారు. ఆయన భవిష్యత్తు సుఖసంతోషాలతో, ఆయూరా రోగ్యలతో ఉండాలని ఆకాంక్షించారు. డిఎస్పీని కలిసిన వారిలో మార్కేట్ యార్డ్ డైరెక్టర్స్ కనపర్తి బాజ్జిబాబు, కొమ్మన బోయిన శివ, సుబ్బారావు, న్యాయవాది కర్నేటి రవి, సాయిల వాసు, గవిని వేణు, వెంకటేశ్వర్లు ఉన్నారు.