– తహశీల్దార్ పై చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చీరాల : తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ అబ్దుల్ సలాం ఆదివారం సాయికాలనీలో ఉరేసుకుని చనిపోయిన ఘటనపై మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు స్పందించారు. విఆర్వో చనిపోవటానికి తాసిల్దార్ విజయలక్ష్మి వేధింపులే కారణమని ఆరోపించారు. వేధింపుల వల్లే సలీం ఉరేసుకొని చనిపోయాడని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పాలేటి రామారావు స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సలీం విధులను వేరే వాళ్లకు అప్పజెప్పి సలీంను తహసీల్దార్ విజయలక్ష్మి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పిర్యాదులో పేర్కొన్నారు. అలాగే భూములు రిజిస్ట్రేషన్లపై, అసైన్డ్ భూములనుపై ఎన్నో అక్రమాలకు ఆమె పాల్పడుతూ ఉందని, ఈ రోజున విఆర్వో సలీం మృతి చెందడానికి ముమ్మాటికీ చీరాల తాసిల్దార్ జి విజయలక్ష్మి కారణమని ఆరోపించారు. అతని మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గవిని శ్రీనివాసరావు, మి౦చాల సాంబశివరావు, పోలయ్య, గవిని ముదియా, గవిని బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Home ప్రకాశం చీరాల తాహశీల్దార్ వేధింపుల కారణంగానే విఆర్ఓ ఆత్మహత్య : మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు